2026 TNUS Meetings and press news
Press note
తేదీ 29/12/2025
*తెలుగు నాడు ఉపాధ్యాయ సంఘం క్యాలెండర్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు*
తెలుగు నాడు ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సచివాలయం లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తెలుగు నాడు ఉపాధ్యాయ సంఘం చేస్తున్న కృషిని హృదయపూర్వకంగా అభినందించారు.
సంఘాన్ని బలోపేతం చేసి భవిష్యత్తులో ఉపాధ్యాయులకు మరెన్నో ప్రయోజనాలు చేకూర్చేలా, విద్యా రంగ అభివృద్ధికి తెలుగు నాడు ఉపాధ్యాయ సంఘం నిరంతరం కృషి చేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగు నాడు ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మన్నం శ్రీనివాస్ గారు మాట్లాడుతూ, ఉపాధ్యాయుల సంక్షేమం, విద్యా ప్రమాణాల పెంపు లక్ష్యంగా,ఆంధ్రప్రదేశ్ ను విద్యా శాఖా మంత్రి నారా లోకేష్ గారు ముందుకు తీసుకెక్తున్నారని,వారి ఆశయాలకు అనుగుణంగా తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం పనిచేస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి గారి మార్గదర్శకత్వంలో విద్యా రంగం మరింత అభివృద్ధి సాధిస్తుందని, తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం విశేష కృషి చేస్తున్నదని ఆయన తెలియ చేశారు.
ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు చెరుకూరి పూర్ణచంద్రరావు, అర్రిబోయిన రాంబాబు, బొట్లగుంట పూర్ణచంద్రరావు, ఆర్.ఎస్.ఎన్. మూర్తి గార్లు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Dec 28 , 2025
తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ
తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన నూతన క్యాలెండర్‌ను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ గౌరవ మంత్రి డాక్టర్ శ్రీ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు తూర్పు నాయుడుపాలెం క్యాంప్ కార్యాలయంలో ఘనంగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ ఉపాధ్యాయులు సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని, విద్యా రంగ అభివృద్ధికి తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం చేస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మన్నం శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షులు చెరుకూరు పూర్ణచంద్రరావు, జిల్లా అధ్యక్షులు అర్రిబోయిన రాంబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి యనమల ఆంజనేయులు,రెహమాన్,మండ్ల శ్రీనివాస్,తదితర,రాష్ట్ర,జిల్లా బాధ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ శ్రీ నూకసాని బాలాజీ గారు..

.jpg)
























.jpg)
.jpg)
.jpg)



























TNUS Appeal ...
No comments