మొహర్రం ఆప్షనల్ సెలవును మార్చాలని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం విజ్ఞప్తి
ప్రచురణ నిమిత్తం
తేదీ : 14/6/2026
మొహర్రం ఆప్షనల్ సెలవును మార్చాలని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం విజ్ఞప్తి
అమరావతి
మొహర్రం ఆప్షనల్ సెలవును ఈ నెల 16వ తేదీకి కేటాయించడం సరైనది కాదని, దానిని మార్చాలని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.
సంఘం రాష్ట్ర అధ్యక్షులు మన్నం శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి రామిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం మొహర్రం పండుగకు ముందు రోజు ఆప్షనల్ సెలవు ప్రకటించడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. అయితే ఈ ఏడాది మొహర్రం ఈ నెల 26వ తేదీన ఉండగా, 16వ తేదీని ఆప్షనల్ హాలిడేగా నిర్ణయించడం ఉద్యోగులు, ఉపాధ్యాయులకు అసౌకర్యం కలిగిస్తుందని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం 26వ తేదీన జనరల్ హాలిడే, 25వ తేదీన ఆప్షనల్ హాలిడే ప్రకటించిన విషయాన్ని గుర్తుచేస్తూ, అదే విధానాన్ని ఆంధ్రప్రదేశ్‌లో కూడా అమలు చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. మొహర్రం పండుగ తేదీలకు అనుగుణంగా సెలవులను పునర్నిర్ణయించాలని కోరారు.


TNUS Appeal ...
No comments